వీరభద్ర స్వామిని దర్శించుకున్న మాజీమంత్రి

వీరభద్ర స్వామిని దర్శించుకున్న మాజీమంత్రి

MHBD: కురవి మండల కేంద్రంలోని శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి ఆలయాన్ని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, BRS నాయకులు గురువారం సందర్శించారు. ఈ సందర్బంగా వారు స్వామివారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారి ఆశీస్సులతో ప్రజలందరూ సంతోషంగా ఉండాలని కోరుకున్నట్లు సత్యవతి తెలిపారు. స్వామివారి ఆశీస్సులతో కాలేశ్వరం తీర్పు BRSకి అనుకూలంగా వచ్చిందన్నారు.