కో-ఆప్షన్ సభ్య పదవికి వాజిదా నామినేషన్
NGKL: కల్వకుర్తి మున్సిపాలిటీలో మహిళా కో-ఆప్షన్ సభ్య పదవికి వాజిదా బేగం గురువారం నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతుతో ఆమె అభ్యర్థిత్వ పత్రాలను సమర్పించారు. పలువురు జర్నలిస్టులతో కలిసి మున్సిపల్ కార్యాలయానికి చేరుకుని నామినేషన్ ప్రక్రియను పూర్తి చేశారు. పట్టణాభివృద్ధి, మహిళల సంక్షేమానికి కృషి చేస్తానని వాజిదా బేగం పేర్కొన్నారు.