మెస్సీ విగ్రహంపై ఫ్యాన్స్ సెటైర్లు

మెస్సీ విగ్రహంపై ఫ్యాన్స్ సెటైర్లు

కోల్‌కతాలో ఏర్పాటు చేసిన 70 అడుగుల మెస్సీ విగ్రహం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఇండియా టూర్‌లో ఉన్న మెస్సీ ఈ విగ్రహాన్ని ఇవాళ ఆవిష్కరించారు. అయితే ఆ విగ్రహం చూసి ఫ్యాన్స్ అవాక్కవుతున్నారు. ఇది అసలు మెస్సీలా లేదని, చూస్తుంటే రొనాల్డోలా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. 'ఈవెంట్ ఆర్గనైజర్‌ను కాదు, ముందు ఆ శిల్పిని అరెస్ట్ చేయండి' అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.