గంజాయి కేసు.. ఇద్దరికి 20 ఏళ్ల జైలు శిక్ష
KMM: గంజాయి కేసులో పట్టుబడిన ఇద్దరు నిందితులకు ఖమ్మం మొదటి అదనపు జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి కే. ఉమాదేవి సంచలన తీర్పు చెప్పారు. ఇద్దరికి 20 ఏళ్ల జైలు శిక్ష, ఒక్కొక్కరికి రూ. 1 లక్ష చొప్పున జరిమానా విధిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. తీర్పు అనంతరం ప్రాసిక్యూషన్‌కు సహకరించిన అధికారులను పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ప్రత్యేకంగా అభినందించారు.