రాజకీయ కక్షతోనే గాంధీ కుటుంబంపై వేధింపులు: డీసీసీ
KMM: నేషనల్ హెరాల్డ్ కేసు రాజకీయ కక్ష సాధింపు చర్యేనని గురువారం డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ మండిపడ్డారు. కేంద్రం ఈడీ, సీబీఐ సంస్థలను అడ్డం పెట్టుకుని గాంధీ కుటుంబాన్ని వేధిస్తోందని ఆరోపించారు. ఖమ్మంలో బీజేపీ కార్యాలయ ముట్టడికి యత్నించిన కాంగ్రెస్ శ్రేణులను అంబేద్కర్ విగ్రహం వద్ద పోలీసులు అడ్డుకొని అరెస్టు చేశారు.