విజ్ఞాన్ మంథన్‌కు దరఖాస్తుల ఆహ్వానం

విజ్ఞాన్ మంథన్‌కు దరఖాస్తుల ఆహ్వానం

MDK: 2025-26 సంవత్సరానికి విద్యార్థి విజ్ఞాన్ మంథన్ దరఖాస్తు చేసుకోవాలని మెదక్ డీఈవో రాధా కిషన్ గురువారం తెలిపారు. 6 నుంచి 11వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు అర్హులని చెప్పారు. సెప్టెంబర్ 30వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.