గోడౌన్ ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్

అన్నమయ్య: మంగళవారం ఉదయం రాజంపేట మండలం మన్నూరు గ్రామంలోని చౌక ధర దుకాణాన్ని (షాప్ నెంబర్: 1139011) జిల్లా సంయుక్త కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ మేరకు దుకాణ సిబ్బందిని పలు విషయాలు అడిగి సూచనలు చేశారు. అనంతరం రాజంపేటలోని మండల స్థాయి స్టాక్ గోడౌన్‌ను పరిశీలించి, రిజిస్టర్లను తనిఖీ చేసి, నిత్యావసర వస్తువుల నాణ్యతను పరిశీలించి తగు సూచనలు చేశారు.