VIDEO: సీఎంను కలిసిన నార్వే రాయబారి
HYD: నార్వే రాయబారి మే ఎలిన్ స్టెనర్, జూబ్లీహిల్స్‌లోని నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశంలో పరస్పర సహకారంపై చర్చలు జరిగాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఎంతో సౌహార్దపూర్వక వాతావరణంలో జరిగిన ఈ భేటీ, ఇరు ప్రాంతాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసే దిశగా సాగింది.