వీరంపల్లిలో రోడు ప్రమాదం.. ఒకరు మృతి

వీరంపల్లిలో రోడు ప్రమాదం.. ఒకరు మృతి

NLR: మనుబోలు మండలం వీరంపల్లిలో సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. నెల్లూరు నుంచి గూడెం వైపు వెళ్తున్న బైక్ అదుపుతప్పి కంటైనర్‌ను ఢీకొనడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. మృతుడి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.