నేడు ఎమ్మెల్యే జారే పర్యటన వివరాలు
BDK: ములకలపల్లి, అశ్వారావుపేట మండలాలలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ఆదివారం పర్యటిస్తారని కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు. నేడు ఉదయం 10 గంటలకు అశ్వారావుపేట మండలానికి చెందిన లబ్ధిదారులకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేస్తారని అన్నారు. ములకలపల్లి మండల నూతన కార్యాలయాన్ని ప్రారంభించి, రైతు వేదికలో ఇందిరమ్మ చీరలు పంపిణీ చేస్తారని తెలిపారు.