అంబేద్కర్ విగ్రహావిష్కరణకు తరలివెళ్లిన పిఠాపురం వాసులు

కాకినాడ: పిఠాపురం నుండి విజయవాడలో జరిగే అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకు శుక్రవారం ఉదయం వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు బస్సుల్లో బయలుదేరారు. అంటరానితనం నిర్మూలన, సమాజంలోని వివక్షల తొలగింపునకు ప్రత్యేక కృషి చేసిన రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని సీఎం జగన్ మోహన్ ఆధ్వర్యంలో ప్రారంభించనున్నారు.