అరుణాచలం భక్తులకు గుడ్ న్యూస్

W.G: అరుణాచలం ప్రత్యేక రైళ్ల సేవలను పొడిగించినట్లు రైల్వే అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. దీపావళి, దసరా పండగల దృష్ట్యా నరసాపురం- అరుణాచలానికి అక్టోబర్ 1, 8, 22, నవంబర్ 5, 19, 26 తేదీల్లో ప్రత్యేక రైలు నడపనున్నట్లు చెప్పారు. అరుణాచలం-నరసాపురానికి అక్టోబర్ 2, 9, 23 నవంబర్ 6, 20, 27 తేదీల్లో ఈ రైలు నడపనున్నట్లు పేర్కొన్నారు.