పుట్టపర్తిలో అభివృద్ధి పనుల తనిఖీ
సత్యసాయి: పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలో ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీమంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి అధికారులతో కలిసి పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. పట్టణంలో నిర్మిస్తున్న రహదారులు, మురుగునీటి పారుదల వ్యవస్థ, ఇతర సౌకర్యాల పురోగతిపై గురించి తెలుసుకున్నారు. పనుల నాణ్యతలో ఎక్కడా రాజీ పడకుండా, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.