మామిడిలోవ హైవేపై యాక్సిడెంట్.. మహిళ మృతి

మామిడిలోవ హైవేపై యాక్సిడెంట్.. మహిళ మృతి

VSP: ఆనందపురం మండలం మామిడిలోవలో బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. హైవే వద్ద నిలిచి ఉన్న లారీని కూరగాయలతో వెళ్తున్న ఆటో ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. తీవ్రంగా గాయపడిన ఆటో డ్రైవర్‌ను ఆసుపత్రిక తరలించారు.