తాడిపత్రిలో చోరీలపై ప్రజలకు అవగాహన
ATP: తాడిపత్రిలో చోరీలపై పోలీసులు ప్రజలకు అవగాహన కల్పించడంలో నిమగ్నమయ్యారు. పట్టణంలో వరుసగా రెండు చైన్స్ స్నాచింగ్ ఘటనలు చోటు చేసుకోవడంతో ప్రధాన సర్కిల్‌లో సీఐ సాయిప్రసాద్ తన సిబ్బందితో కలిసి అవగాహన కల్పించారు. వీధుల్లో ఎవరైనా బైక్‌పై హెల్మెట్ పెట్టుకుని అనుమానంగా తిరుగుతుంటే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.