అదృశ్యమైన విద్యార్థి ప్రవీణ్ ఆచూకీ లభ్యం
ATP: గుంతకల్లులో 3 రోజుల క్రితం అదృశ్యమైన విద్యార్థి ప్రవీణ్ ఆచూకీ లభ్యమైనట్లు రూరల్ ఎస్సై బాలముణి తెలిపారు. ఉపాధ్యాయుడు శ్రీరాములు కుమారుడు ప్రవీణ్ ఈ నెల 9న ఇంటి నుంచి వెళ్లిపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారించి ప్రవీణ్ కళ్యాణదుర్గంలోని తన స్నేహితుడి ఇంట్లో ఉన్నట్లు గుర్తించారు. అనంతరం తల్లిదండ్రులకు అప్పగించారు.