వైద్య కేంద్రంలో అడిషనల్ కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు
NRPT: దామరగిద్ద మండలం క్యాతన్‌పల్లి గ్రామంతో పాటు మండల కేంద్రంలోని అంగన్వాడీ, పశు వైద్యశాల, నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను అడిషనల్ కలెక్టర్ సంచిత్ గంగ్వార్ మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు. అంగన్వాడీలో పిల్లలకు ఇస్తున్న భోజనం నాణ్యతను ఆయన పరిశీలించారు. పశువైద్య శాల సేవలు, రోగుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.