ఫ్రీ టైలరింగ్ శిక్షణ కేంద్రానికి 40 కుట్టు మిషన్లు సరఫరా

SRD: కంగ్టి మండలం బోర్గి గ్రామంలో మహిళలకు ఉచితంగా నిర్వహిస్తున్న ఫ్రీ టైలరింగ్ శిక్షణ కోసం అవసరమయ్యే 40 కుట్టు మిషన్లు సప్లై చేసినట్లు గ్రామ స్వరాజ్య సంస్థ జిల్లా కోఆర్డినేటర్ అమీనా గురువారం తెలిపారు. స్థానికంగా నెలరోజుల పాటు యువతులు, మహిళలకు శిక్షణ కొనసాగుతున్నదని చెప్పారు. శిక్షణ కాలం పూర్తయ్యాక సగం రాయితీపై మిషన్లు వారికి అందజేస్తామన్నారు