VIDEO: సమస్యలు విననప్పుడు సభలు ఎందుకు..?
WGL: నగరంలోని 12వ డివిజన్ పరిధిలో గురువారం వార్డు సభ నిర్వహించగా మంత్రి కొండా సురేఖ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అయితే మంత్రి తమ సమస్యలు వినకుండానే వెళ్లిపోయారని ప్రజలు మండిపడ్డారు. సమస్యలు విననప్పుడు ఈ వార్డు సభలు ఎందుకని ప్రశ్నించారు. హామీలు ఏమయ్యాయి అని ప్రశ్నించారు. కార్యకర్తలు, అధికారులు తమను అడ్డుకోవడం సరికాదని అసహనం వ్యక్తం చేశారు.