'కార్మికుల సమస్యలు పరిష్కరించాలి'
SRCL: గ్రామపంచాయతీ కార్మికులకు సమస్యలు పరిష్కరించాలని జిల్లా గ్రామ పంచాయతీ కార్మికుల సంఘం అధ్యక్షుడు మల్యాల నర్సయ్య అన్నారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు చందుర్తి మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో రాధకు శనివారం పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. నర్సయ్య మాట్లాడుతూ.. పాత పద్ధతిలోనే వేతనాలు చెల్లించాలన్నారు.