VIDEO: నీటి తొట్లు ఇలా.. పశువుల దాహం తీరేదెలా.!
KDP: మైదుకూరు(M) తువ్వపల్లె దళితవాడలో పశువుల దాహార్తి తీర్చడం కోసం ఏర్పాటు చేసిన నీటి తొట్లు అలంకారప్రాయంగా దర్శనమిస్తున్నాయి. వేసవి రావడంతో జీవాలు తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని గ్రామస్థులు అంటున్నారు. నీటి తొట్లు మట్టిలో కూరుకుపోయాయన్నారు. పంచాయతీ అధికారులు చర్యలు చేపట్టి తొట్లను అందుబాటులోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.