రేగిడిలో తెల్లవారిజామున ట్రాక్టర్ బోల్తా

రేగిడిలో తెల్లవారిజామున ట్రాక్టర్ బోల్తా

VZM: రాజాం–పాలకొండ ప్రధాన రహదారిలో శిర్లాం గ్రామం వద్ద బుధవారం తెల్లవారుజామున చెరుకు లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడింది. అధిక లోడు కారణంగా ఈ ప్రమాదం జరిగినప్పటికీ ఎవరికీ గాయాలు కాలేదు. ఆ సమయంలో రోడ్డుపై వాహనాలు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ట్రాఫిక్‌కు అంతరాయం కలగడంతో స్థానికులు జేసీబీ సహాయంతో రోడ్డుపై పడిన చెరుకును తొలగించారు.