రేపటి మ్యాచ్‌కు కూడా నితీష్ డౌటే..?
ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి ఆస్ట్రేలియాతో సిరీస్‌లో తొలి మూడు T20లకు గాయం కారణంగా దూరమయ్యాడు. అయితే, ప్రస్తుతం అతడు కోలుకున్నప్పటికీ, నాలుగో టీ20కి జట్టులో చోటు దక్కడం కష్టమేనని చెప్పవచ్చు. ఎందుకంటే, ఆల్‌రౌండర్ కోటాలో జట్టులోకి వచ్చిన వాషింగ్టన్ సుందర్ గత మ్యాచ్‌లో అద్భుతంగా రాణించాడు. దీంతో, నాలుగో టీ20లో ఎలాంటి మార్పులు ఉండే అవకాశం లేదు.