'పరీక్షలకు హాజరుకాని విద్యార్థుల గురించి తెలుసుకోండి'
NGKL: విద్యార్థి జీవితంలో పదవ తరగతి కీలకమైందని, ఉన్నత విద్యకు ఇది పునాదిగా నిలుస్తుందని జిల్లా కలెక్టర్ బదవత్ సంతోష్ తెలిపారు. శనివారం నిర్వహించిన పదవ తరగతి పరీక్షలకు జిల్లాలో 25 మంది విద్యార్థులు హాజరు కాలేదని అధికారులు గుర్తించారు. అంతటి ప్రాధాన్యత కలిగిన పరీక్షలకు విద్యార్థులు ఎందుకు గైర్హాజరయ్యారో తెలుసుకుని వివరాలు సేకరించాలని ఉపాధ్యాయులను కలెక్టర్ ఆదేశించారు.