'ప్రభుత్వ స్థలాలు ఆక్రమిస్తే ఉపేక్షించం'
VZM: కొత్తవలస మండలం చింతలపాలెం రెవెన్యూ పరిధి సర్వే నెంబరు. 330లో ఓ వ్యక్తి ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకొని రేకులతో కూడిన బడ్డిని ఏర్పాటు చేసుకొన్నారు. ఈ విషయం ఇంఛార్జ్ తహసీల్దార్ దృష్టికి వెళ్లడంతో స్థానిక విఆర్వో గోవిందరావు, పంచాయతీ కార్యదర్శిలను పంపించి జేసీబీ సహాయంతో ఇవాళ తొలగించారు. ప్రభుత్వ స్థలాలు ఆక్రమిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.