ఖాదీకి GI ట్యాగ్ పై హర్షం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే
SKLM: పొందూరు ఖాదీకి GI ట్యాగ్ లభించడం పట్ల ఎమ్మెల్యే రవికుమార్ హర్షం వ్యక్తం చేశారు. తన నిరంతర ప్రయత్నాలకు ఫలితం దక్కిందని ఇవాళ ఓ ప్రకటనలో తెలిపారు. పొందూరు ఖాదీకి అంతర్జాతీయ గుర్తింపు రావడం వల్ల చేనేత కార్మికుల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని తెలిపారు. ప్రభుత్వం తరఫున ఖాదీ పరిశ్రమకు అన్ని విధాల సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.