ఉపాధి హామీ పనులపై 'ప్రజావేదిక'
NLG: చిట్యాల మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం ఉపాధి హామీ పథకం 16వ సామాజిక తనిఖీ, 'ప్రజావేదిక' నిర్వహించారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.2.37 కోట్ల వ్యయంతో జరిగిన పనులపై ఈ ఓపెన్ ఫోరంలో సమీక్షించారు. పనుల పారదర్శకత, అమలు తీరును అధికారులు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శేఖర్ రెడ్డి ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.