అన్నం తింటే షుగర్ గ్యారెంటీ: చంద్రబాబు
AP: వరి అన్నం తింటే షుగర్ ముప్పు ఎక్కువని, అందుకే తాను రైస్ తినడం మానేశానని సీఎం చంద్రబాబు వెల్లడించారు. తూర్పుగోదావరి పర్యటనలో ఆయన ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. షుగర్ వస్తే అన్ని రోగాలు వస్తాయని.. మన దగ్గర వచ్చే జబ్బుల్లో డయాబెటిస్, బీపీ టాప్ ప్లేస్‌లో ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల ఆరోగ్యం కోసం త్వరలో 'సంజీవని' ప్రాజెక్టు తెస్తున్నట్లు చెప్పారు.