ధాన్యం కొనుగోలు ప్రక్రియను తనిఖీ చేసిన జేసీ
VZM: గర్భాం రైతు సేవా కేంద్రాన్ని జాయింట్ కలెక్టర్ ఎస్.సేధు మాధవన్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇక్కడి ధాన్యం కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు. అధికారులు చేసిన ఏర్పాట్లపై ఆరా తీశారు. రైతులు ఇబ్బంది పడకుండా సమర్ధవంతంగా కొనుగోలు ప్రక్రియను పూర్తి చేయాలని సిబ్బందిని ఆదేశించారు.