ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన ఎమ్మెల్యే ధర్మరాజు
ELR: గణపవరం మండలం పిప్పర ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని వైద్య సేవల అందుబాటు, రోగులకు అందిస్తున్న సేవల స్థాయి, స్టాఫ్ హాజరు, శుభ్రత, అవసరమైన మందుల లభ్యత, వైద్య పరికరాల పరిస్థితి, భవనం స్థితిగతులు, వసతులు వంటి అంశాలను సమగ్రంగా పరిశీలించారు.