VIDEO: ఇంట్లోకి చొరబడ్డ రక్త పింజర
NGKL: జిల్లా కేంద్రంలో బుధవారం ఒక ఇంట్లోకి మూడు అడుగుల విషపూరిత రక్త పింజర పాము చొరబడింది. సమాచారం అందుకున్న స్నేక్ క్యాచర్ వంశీ వెంటనే అక్కడికి చేరుకుని పామును పట్టుకున్నారు. అనంతరం, పట్టుకున్న పామును అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. పామును పట్టుకోవడంతో ఇంటి సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.