విద్యుత్ షాక్‌తో మూడు గేదలు మృతి

విద్యుత్ షాక్‌తో మూడు గేదలు మృతి

SRPT: విద్యుత్ షాక్‌తో మూడు గేదెలు మృతి చెందిన సంఘటన నాగారం మండలం ఈటూరులో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన చంద్రయ్య 3 గేదెలు మేతకు వెళ్లాయి. అక్కడ ప్రమాదవశాత్తు కరెంట్ తీగలకు తగిలి, విద్యుత్ షాక్‌తో అక్కడికిక్కడే మృతి చెందాయి. వాటి విలువ సుమారు లక్ష రూపాయలు ఉంటుందని ఆర్థికంగా ఆదుకోవాలని బాధితుడు ప్రభుత్వాన్ని కోరారు.