ఈ నెల 13న జాతీయ లోక్ అదాలత్

కృష్ణా: జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు ఈ నెల 13న ఉమ్మడి కృష్ణా జిల్లాలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జీ. గోపి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాజీ చేయదగిన సివిల్, క్రిమినల్, చెక్ బౌన్స్, మోటార్ యాక్సిడెంట్ కేసులను లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన తెలిపారు.