యాదగిరిగుట్ట పూర్వ ఉద్యోగులను రప్పించాలి: ఈవో
BHNG: అనుభవంలేని గుట్ట దేవస్థాన ఉద్యోగులను బదిలీచేసి, గతంలో ఇక్కడ పనిచేసిన ఉద్యోగులను తిరిగి యాదగిరిగుట్టకు రప్పించాలని దేవస్థాన ఈవో భవానీ శంకర్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఈ నెల 7న రాష్ట్ర దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. త్వరలో యాదగిరిగుట్ట దేవస్థానం స్వయం ప్రతిపత్తిగల సంస్థగా మారనున్నదని సోమవారం ఆయన పేర్కొన్నారు.