తప్పిపోయిన చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు

తప్పిపోయిన చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు

ప్రకాశం: మార్కాపురం ఆర్టీసీ బస్టాండ్ వద్ద శనివారం ఉదయం నాలుగు సంవత్సరాల చిన్నారి తప్పిపోయిన విషయం తెలిసిందే.. అయితే మార్కాపురం సీఐ ఆధ్వర్యంలో పాపను విచారించిన పోలీసులు, ఆమె తల్లిదండ్రులను గుర్తించారు. విచారణ అనంతరం పాపను వారికి క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించారు. పోలీసులు చూపిన చొరవకు తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.