బొలెరో వాహనం ఢీ.. వ్యక్తి మృతి

బొలెరో వాహనం ఢీ.. వ్యక్తి మృతి

NGKL: వంగూర్ మండలంలో ఇవాళ రోడ్డు ప్రమాదం జరిగింది. వెలమలపల్లి గేటు సమీపంలో బొలెరో వాహనం శ్రీశైలం నుంచి వస్తుండగా.. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న రైతు బాలయ్యను ఢీ కొట్టాడు. దీంతో రైతు అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.