VIDEO: సోమవరప్పాడు వద్ద పోలీసుల వినూత్న ప్రచారం
ELR: దెందులూరు మండలం సోమవరప్పాడు వద్ద పోలీసులు ఏర్పాటు చేసిన 'దొంగల ఫ్లెక్సీ' చర్చనీయాంశమైంది. జాతీయ రహదారిపై దొంగల ఫొటోలు, పేర్లు, వారి ఊళ్ల వివరాలతో కూడిన ఫ్లెక్సీని అందరూ ఆసక్తిగా తిలకిస్తున్నారు. చైన్ స్నాచింగ్, వాహన చోరీలకు పాల్పడే వారిని గుర్తించేందుకు, ప్రజలను అప్రమత్తం చేసేందుకు పోలీసులు ఈ వినూత్న ప్రచారాన్ని చేపట్టినట్లు తెలిపారు.