అయిజలో రేపు పవర్ కట్

అయిజలో రేపు పవర్ కట్

GDWL: అయిజ పట్టణంలోని పలు ప్రాంతాల్లో గురువారం సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఏడీఈ నీలి గోవిందు తెలిపారు. 132 కేవీ సబ్ స్టేషన్ పరిధిలోని 33 కేవీ ఫీడర్‌పై ఉన్న చెట్ల కొమ్మలను తొలగించే పనుల కారణంగా ఈ కోత విధిస్తున్నట్లు వివరించారు. విద్యుత్ అంతరాయం కలిగే అవకాశం ఉన్నందున వినియోగదారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.