కలెక్టరేట్ ఆవరణలో ఉద్యోగుల హోలీ సంబరాలు

కామారెడ్డి: కలెక్టరేట్ ఆవరణలో సోమవారం హోలీ వేడుకలు టీఎన్జీఓఎస్, టీజీఓ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. టీఎన్జీఓఎస్ కార్యదర్శి బి. సాయిలు, టీజీఓ అధ్యక్షుడు దేవేందర్, ప్రధాన కార్యదర్శి సాయిరెడ్డి ఆధ్వర్యంలో సంబరాలు జరిపారు. ఉద్యోగులు ఒకరికి ఒకరు రంగులు చల్లుకుంటూ సంబరాలు చేసుకున్నారు. దీంతో కలెక్టరేట్ ఆవరణలో పండగ వాతావరణం నెలకొంది.