'వడ్డీ రేట్ల పాలసీ సవరణకు ఆమోదం'

ELR: భీమడోలు రైతు సేవా సహకార సంఘంలో పర్సన్ ఇన్‌ఛార్జ్ గన్ని వీరాంజనేయులు అధ్యక్షతన శుక్రవారం బోర్డు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో త్వరలో బ్యాంక్ పరిధిలో బంగారంపై రుణ సౌకర్యం కల్పించాలని నిర్ణయించారు. అలాగే, బ్యాంకులో రుణాలు తీసుకున్న రైతులకు ఎరువులపై ఇప్పటి వరకు ఉన్న 16% వడ్డీని 14%కి తగ్గించేలా పరిశీలిస్తామని ఆయన తెలిపారు.