మూడో రోజుకు చేరిన ఆర్టీసీ కార్మికుల నిరసన
BHNG: ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్ల కోసం చేపట్టిన సమ్మె మూడో రోజుకు చేరుకోవడంతో కోదాడ పట్టణంలో రవాణా వ్యవస్థ పూర్తిగా నిలిచిపోయింది. బస్సులన్నీ డిపోలకే పరిమితం కావడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఇదే అదునుగా భావించిన ప్రైవేట్ వెహికల్స్ వారు అదనపు డబ్బులు వసూలు చేస్తున్నారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.