రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

ప్రకాశం: ఒంగోలు నగర పరిధిలోని పేర్నమిట్ట వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. నగరంలోని సమతానగర్‌కు చెందిన రాయిని శేషయ్య బైక్‌పై ద్విచక్ర వాహనంపై పేర్నమిట్ట వెళ్తుండగా.. ఇన్నోవా వాహనం ఢీకొట్టింది. గమనించిన స్థానికులు తీవ్రంగా గాయపడిన శేషయ్యను ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. ఘటనపై ఒంగోలు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.