నేడు వరంగల్‌లో ప్రపంచ సుందరీమణుల పర్యటన

TG: వరంగల్‌లో ఇవాళ ప్రపంచ సుందరీమణులు పర్యటించనున్నారు. 109 దేశాలకు చెందిన మిస్ వరల్డ్ పోటీదారులు నగరంలోని వెయ్యి స్తంభాల గుడి, యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం, ఓరుగల్లు కోటను సందర్శించనున్నారు. ఈ సందర్భంగా పర్యాటక శాఖ అధికారులు ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అలాగే, పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.