జూబ్లీహిల్స్‌లో ప్రచారం చేసిన మాజీ ఎమ్మెల్యే
SRPT: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర నాయకులు, హుజూర్‌నగర్ మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి, MLC చిన్నమైల్ అంజిరెడ్డితో కలిసి వివిధ డివిజన్లలో ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి పథకాల గురించి ఓటర్లకు వివరించారు. దేశాభివృద్ధి కోసం బీజేపీకి మద్దతు తెలుపి, జూబ్లీహిల్స్ పట్టణాభివృద్ధికి తోడ్పడాలని ప్రజలను కోరారు.