పిడుగుపాటుతో 15 పొట్టేళ్ల మృతి

GDWL: మల్దకల్ మండలం బిజ్వారంలో ఆదివారం కురిసిన గాలివాన సమయంలో పిడుగు పడటంతో 15 పొట్టేళ్లు మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. ఆలూరు తిమ్మప్ప గ్రామ శివారులో పొట్టేళ్లను మేపుతుండగా ప్రమాదం జరిగినట్లు వెల్లడించారు. మృతిచెందిన పొట్టేళ్ల విలువ సుమారు రూ.3 లక్షలుగా ఉందని స్థానికులు తెలిపారు.