నేరాల నియంత్రణకు ‘స్మార్ట్ పోలీసింగ్’: ఎస్పీ
సత్యసాయి: జిల్లాలో నేరాల నియంత్రణకు విజిబుల్ పోలీసింగ్‌తో పాటు స్మార్ట్ పోలీసింగ్ చేపట్టాలని జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఇవాళ పుట్టపర్తి సాయి ఆరామంలో నిర్వహించిన నేర సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రౌడీ షీటర్లు, పాత నేరస్తులపై నిరంతర నిఘా ఉంచాలని, సమాజానికి హానికరంగా మారిన వారిపై పీడీ యాక్ట్ అమలు చేయాలని స్పష్టం చేశారు.