VIDEO: ప్రొద్దుటూరులో ఉద్యోగి మృతి.. ఉద్రిక్తత

KDP: ప్రొద్దుటూరు మున్సిపాలిటీకి చెందిన పిట్టర్ రంగనాయకులు సోమవారం సాయంత్రం స్థానిక గాంధీ రోడ్డులోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో మృతి చెందారు. ఆసుపత్రి యజమాన్యమే రంగనాయకుల మృతికి కారణమని ఆయన బంధువులు ఆరోపించారు. ఈ ఆరోపణలతో ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందుకున్న మున్సిపల్ కమిషనర్ రవిచంద్రారెడ్డి, CI తిమ్మారెడ్డి వచ్చి పరిస్థితిని సమీక్షించారు.