VIDEO: విమానంలో సాంకేతిక లోపం
విశాఖపట్నం నుంచి తిరుపతి వెళ్లాల్సిన ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. టేకాఫ్‌కు సిద్ధమవుతున్న సమయంలో లోపాన్ని గుర్తించిన సిబ్బంది ప్రయాణాన్ని నిలిపివేసి, ప్రయాణికులను వెయిటింగ్ హాల్‌కు తరలించారు. కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే ఇదే విమానంలో రెండోసారి సాంకేతిక సమస్య తలెత్తడంపై ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.