మద్నూర్ సొసైటీలో కార్యదర్శి లేక ఇబ్బందులు...!
KMR: మద్నూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (సొసైటీ)లో 11 రోజులుగా కార్యదర్శి నియామకం లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం సొసైటీ ద్వారా శనగ విత్తనాలు పంపిణీ, సోయాబిన్ కొనుగోలుకేంద్రం చేపడుతున్నారు. దీంతో కార్యదర్శి పోస్ట్ ఖాళీగా ఉండటంతో సొసైటీలో పనులు ముందుకు సాగడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. గత కార్యదర్శి అక్టోబర్ 31న పదవి విరమణ చేశారు.