సినీ కార్మికులను కొనియాడిన మంత్రి
TG: సినీ కార్మికుల సంక్షేమం, అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ రంగంలో పనిచేసే ప్రతి ఒక్కరూ ఎంతో కష్టపడతారని, వారి త్యాగం వెలకట్టలేనిదని కొనియాడారు. కార్మికుల ఆర్థిక, సామాజిక భద్రతా సమస్యలపై తమ ప్రభుత్వానికి పూర్తి అవగాహన ఉందన్నారు.